సముద్రంలో సొరలా విజృంభించిన ‘దేవర’.. గ్లింప్స్ అదుర్స్..

TV9 Telugu

09 January 2024

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘దేవర’.

ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. 80 సెకన్లలో విజువల్ ఫీస్ట్ చూపించారు కొరటాల.

అలాగే ఈ వీడియోలో టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇందులో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ వర్క్. ఈ సినిమా కోసం సముద్రాన్నే రీ క్రియేట్ చేస్తున్నారు.

ఇక టీజర్ అంతా సముద్రంలోనే సాగింది. ఎన్టీఆర్ మాస్ లుక్ లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది.

ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

అందులో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‌పై భారీ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల. సినిమా ఎప్రిల్ 5న విడుదల కానుంది.