మోహన్‌లాల్‌ కొత్త సినిమా ముచ్చట..

TV9 Telugu

24 April 2024

మలయాళ ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్‌ కథానాయకుడుగా నటిస్తున్న 360వ సినిమా తాజాగా లాంఛనంగా మొదలైంది.

ఎల్‌ 360 అని వర్కింగ్‌ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. త్వరలోనే సినెమా టైటిల్ ను ప్రకటించనున్నారు మూవీ మేకర్స్.

మోహన్‌లాల్‌కి జోడీగా అలంటి హీరోయిన్ శోభన నటిస్తున్నారు. రేజాపుత్ర విజువల్‌ మీడియా పతాకంపై తెరకెక్కుతోంది.

ఈ సందర్భంగా తన 360 సినిమాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు మలయాళ ఇండస్ట్రీ సీనియర్ నటుడు మోహన్‌లాల్‌.

నా ఎదుగుదలకు సహకరించిన ప్రేక్షకులకు, నటీనటులకు, డైరెక్టర్లుకి, నిర్మాతలకి అందరికి కృతజ్ఞతలు అని తెలిపారు.

తరుణ్ మూర్తి మోహన్‌లాల్‌ 360వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో మూడు సినిమాలకు దర్శకుడిగా ఉన్నారు.

ఈ మూవీతో చాల సంవత్సరాల తర్వాత సీనియర్ హీరోయిన్ శోభన, సీనియర్ హీరో మోహన్‌లాల్‌ కలిసి తెరపై కనిపించనున్నారు.

రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ ఈ చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.