20 June 2024

వయ్యారాలతో నెట్టింటిని హీటేక్కిస్తోన్న బ్యూటీ.. గుర్తుపట్టారా..?

Rajitha Chanti

Pic credit - Instagram

అయ్య బాబోయ్.. మిథిలా ఇది నువ్వేనా.. అన్న రేంజ్‏లో గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోయింది హీరోయిన్ మిథిలా పాల్కర్. 

కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో ఒక్క ప్రాజెక్ట్ అనౌన్స్ చేయని పొట్టి నూడుల్స్ బ్యూటీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తుంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముంబై భామ మిథిలా పాల్కర్.

ఈ సినిమాలో పొట్టి నూడుల్స్ పేరుతో తెగ పాపులర్ అయ్యింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ వయ్యారి. 

నటిగానే కాకుండా సోషల్ మీడియా స్టార్‏గా, గాయనిగా, రచయిత్రిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ఉంగరాల జుట్టు చిన్నది. 

ఓరి దేవుడా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యింది ఈ ముంబై బ్యూటీ. 

ఇటీవల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లిలో తెగ సందడి చేసింది మిథిలా. అలాగే ఈ బ్యూటీ నెట్టింట ఫుల్ యూక్టివ్‏గా ఉంటుంది.

తాజాగా మిథిలా స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేసింది. సినిమాలో ఎంతో క్యూట్‏గా కనిపించిన మిథిలా గ్లామర్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.