ఆ హంసకైనా తగునా ఈమె వంటి సోయగం..

02 December 2023

11 జనవరి 1993న మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో మరాఠీ కుటుంబంలో జన్మించింది అందాల భామ మిథిలా పాల్కర్.

మొదట్లో తన తల్లిదండ్రులతో వసాయ్‌లో నివసించింది. అయితే చదువు కోసం రోజువారీ ప్రయాణ అసౌకర్యాల కారణంగా ఆమె తల్లి తాతలతో కలిసి దాదర్‌లో ఉంది.

బాంద్రాలోని MMK కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ మాస్ మీడియా (BMM)ని అభ్యసించింది. ఆ తర్వాత చలనచిత్రాలు, థియేటర్‌లో పాలుపంచుకుంది.

నటులు లేని కుటుంబం నుండి వచ్చింది ఈ వయ్యారి. ఆమె నటించాలనే నిర్ణయాన్ని తన తాత మొదట ఆమోదించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పాల్కర్ క్వాసర్ థియేటర్ ప్రొడక్షన్స్ (QTP)కి చెందిన క్వాసర్ పదమ్‌సీకి తన మొదటి ఆడిషన్ ఇచ్చింది.

మరాఠీ గాయని వర్షా భావేచే వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. కథక్‌లో కూడా శిక్షణ పొందింది ఈ ముద్దుగుమ్మ.

లాస్ ఏంజిల్స్‌లోని స్టెల్లా అడ్లెర్ స్టూడియో ఆఫ్ యాక్టింగ్‌లో నటనలో క్రాష్ కోర్సు తీసుకుంది ఈ వయ్యారి భామ.

2014 నుంచి నటిస్తున్న ఈ బ్యూటీ.. 2022లో విశ్వక్ సేన్ సరసన ఓరి దేవుడా చిత్రంలో తెలుగులో కథానాయకిగా పరిచయం అయింది.