ఈ వయ్యారి లేనిదే అందనికి ఉనికి ఉండదేమో..

21 December 2023

TV9 Telugu

10 మే 1995న కేంద్రపాలిత ప్రాంతం పాండిచేరిలోని ఓ తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార మిర్నాళిని రవి.

బెంగుళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.

బెంగుళూరు IBMలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది. నటనపై ఇష్టంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.

ఆమె తమిళం మరియు తెలుగు భాషలకు సుపరిచితురాలు. ఈమె టిక్‌టాక్, డబ్‌స్మాష్ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

2019లో వచ్చిన సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంతో నటిగా కోలీవుడ్ ద్వారా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

అదే ఏడాది తమిళ జిగర్తాండకి రీమేక్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రంలో ప్రధాన పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయింది.

2023లో తెలుగు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ హీరోగా వచ్చిన ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో కనిపించింది.

ఇటీవల సుదీర్ బాబుకి జోడిగా మామా మశ్చీంద్ర అనే యాక్షన్ చిత్రంలో కథానాయకిగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.