చీరలో అందానికి నిలువెత్తు రూపంలా మెరిసిపోతున్న మిర్నాళిని రవి..

14 October 2023

10 మే 1995న కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఓ తమిళ కుటుంబంలో జన్మించింది 28 ఏళ్ళ వయ్యారి మిర్నాళిని రవి.

బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది.

సినిమాలకి ముందు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ దిగ్గజం IBM కంపెనీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది ఈ భామ.

కొన్నాళ్ళకు నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని విడిచి తన పూర్తి సమయం సినిమాలపైనే వెచ్చించింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తన అందంతో ఆకట్టుకుంది అందాల తార మిర్నాళిని రవి.

2019లో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాతో సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

అదే సంవత్సరం వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంలో బుజ్జమ్మ అనే ఓ పాత్రతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది ఈ భామ.

2023లో తాజాగా విడుదలైన సుధీర్ బాబు హీరోగా చేసిన మామా మశ్చీంద్ర చిత్రంలో ఓ హీరోయిన్ గా కనిపించింది ఈ వయ్యారి భామ.