ఆ చుక్కలు ఈ వయ్యారి వెంటపడవా.. వాటి మెరుపును తనతో తీసుకుపోతుందని..
TV9 Telugu
15 April 2024
10 మే 1995న కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార మృణాళిని రవి.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లేక్ మోంట్‌ఫోర్ట్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.
బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని చదివింది.
బెంగుళూరులో IBMలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలను అప్‌లోడ్ చేసేది. అవి కాస్త వైరల్ కావడంతో బాగా పాపులర్ అయింది.
ఈమెను ఓ వీడియోలో చూసిన దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా, 2019లో తమిళ చిత్రం సూపర్ డీలక్స్ సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత అదే సంవత్సరం అధర్వ సరసన గద్దలకొండ గణేష్‌తో కథానాయకిగా తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ.
2023లో ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చేంద్ర అనే రెండు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి