చీరలో 'జైలర్' కోడలు మెరుపులు.. వలపుల విందు..

15 September 2023

మిర్నా మీనన్.. ఈ పేరు తెలుగు ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం లేదు. కానీ 'జైలర్' కోడలు అంటే.. ఠక్కున గుర్తు వస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వివిధ ఫోటో షూట్స్‌తో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న మిర్నా మేనన్.. లేటెస్ట్ పిక్స్ కుర్రకారు చూపుతిప్పుకోనివ్వట్లేదు.

'జైలర్' సినిమాలో రజినీకాంత్ కోడలుగా వెండితెరపై మెరిసిన మిర్నా మీనన్.. ప్రస్తుతం అటు తమిళం, ఇటు తెలుగులో బాగా వినిపిస్తున్న పేరు.

ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. నెట్టింట రకరకాల అవుట్‌ఫిట్స్‌లో పోజులిస్తూ.. దర్శకనిర్మాతలను తన వైపు తిప్పుకుంటోంది మిర్నా మీనన్.

లేటెస్ట్‌గా మిర్నా మీనన్ చీరకట్టులో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వయోలెట్ శారీలో ఆమె దేవకన్యలా కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వెండితెరపై పద్దతిగా.. సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపిస్తూ.. కుర్రకారును కవ్విస్తూ తమ హృదయాలను కొల్లగొడుతోంది మిర్నా మీనన్.

ఇప్పటిదాకా తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది మిర్నా మీనన్. అందులో ఒకటి ఆది సాయికుమార్ సరసన 'క్రేజీ ఫెలోస్'.. ఇంకొటి అల్లరి నరేష్‌తో 'ఉగ్రం'.

‘జైలర్’ తీసుకొచ్చిన భారీ క్రేజ్‌తో.. తెలుగులో మిర్నా మీనన్.. ఎలాంటి అవకాశాలు సంపాదిస్తుందో వేచి చూడాలి.