ఒంపుల హంపి శిల్పమో.. బాబు గీసిన చిత్రమో ఈ  భామ.. అందంతోనే మాయ చేస్తుంది..

TV9 Telugu

23 January 2024

15 డిసెంబర్ 1994న కేరళ రాష్ట్రంలోని ఇడుక్కిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగింది అందాల తార మిర్న మీనన్.

ఈమె అసలు పేరు సయన సంతోష్. అతిరా సంతోష్, అదితి మీనన్ అనే మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి ఈ వయ్యారి భామకి.

సంతోష్ కుమార్ మరియు శోబనా సంతోష్ ఈ ముద్దుగుమ్మ తల్లిదండ్రులు. ఈ భామకి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.

కేరళ రాష్ట్రంలోని రామకల్‌మేడులో సేక్రేడ్‌ హార్ట్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల భామ.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేసింది. అయితే ఆమె ఎప్పటి నుంచో నటి కావాలని కోరుకున్నందున కేరళకు తిరిగి వచ్చింది.

ఒక రియాలిటీ షో మరియు ధాతుపుత్రి అనే సిరీస్‌తో టెలివిజన్‌లో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది ఈ బ్యూటీ.

బుల్లితెరపై సయన సంతోష్ గా క్రెడిట్ అందుకుంది. అదితి మీనన్ గా ఫిల్మ్ కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత మిర్న మీనన్ గా పేరు మార్చుకుంది.