విశ్వంలో ఉన్న అందమంతా ఈమెకు దాసోహం అయిందేమో..

30 October 2023

15 డిసెంబర్ 1992న కేరళలోని ఇడుక్కిలో సంతోష్ కుమార్, శోభనా సంతోష్ దంపతులకు జన్మించింది వయ్యారి భామ మిర్న మీనన్.

ఈమెకు అతిరా సంతోష్, అదితి మీనన్ అనే రెండు పేర్లు కూడా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మకి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.

అధితి మీనన్‌ అనే పేరుతో 2016లో తమిళ చిత్రం పట్టతారిలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ.

తరవాత 2018లో కలవాణి మాప్పిళ్ళై అనే మరో తమిళ చిత్రంలో హీరోయిన్ గా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సొగసరి.

2020లో మోహన్ లాల్ బిగ్ బ్రదర్ అనే చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో మళయాల సినీ రంగప్రవేశం చేసింది ఈ వయ్యారి.

2022లో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన క్రేజీ ఫెలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2023లో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఉగ్రం మూవీలో అల్లరి నరేష్ కి జోడిగా నటించి మెప్పించింది ఈ భామ.

ఇటీవల తెరపైకి వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా కనిపించి ఆకట్టుకుంది ఈ అందాల తార.