అందానికే ఈమె అందం అప్పు ఇవ్వగలదు.. మిర్నాకి కుర్రకారు ఫ్లాట్.. 

03 October 2023

తమిళంలో పట్టతారి అనే చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అందాల తార మిర్నా మీనన్. ఈ చిత్రంలో అందం అభినయంతో ఆకట్టుకుంది.

దీని తర్వాత తమిళ కలవాణి మాప్పిళ్ళై చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. గాంధీ మణివాసగం ఈ చిత్రానికి దర్శకుడు.

ఈమె అదితి మీనన్ పేరుతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. అందుకే పట్టతారి, కలవాణి మాప్పిళ్ళై చిత్రాల్లో అధితి మీనన్‌ అనే ఉంటుంది.

దీని తర్వాత బిగ్ బ్రదర్ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ కేరళ కుట్టి. మలయాళ భామ అయినా తమిళ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టింది.

గత ఏడాది అంటే 2022లో ఆది సాయి కుమార్ క్రేజీ ఫెలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది అందాల భామ మిర్నా మీనన్.

దీని తర్వాత అల్లరి నరేష్ సరసన ఉగ్రం చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ మళయాళీ భామ. ఈ చిత్రంతో కుర్రాళ్ల మనసులు దోచేసింది.

ఇటీవల జైలర్ చిత్రంలో రజినీకాంత్ కోడలిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బర్త్ మార్క్ అనే తమిళ చిత్రంలో నటిస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ వయ్యారి భామ. ఆ ఫోటోలకు కుర్రాళ్లు మాత్రముగ్దులు అవుతున్నారు.