సలార్ అభిమానులకు అదిరిపోయే వార్త..
14 December 2023
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ చిత్రం సలార్.
ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయక. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ చిత్రం కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడింది.
ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది డీలా పడిన టాలీవుడ్ కి ఈ చిత్రం ఊపిరి పోస్తుందిని భావిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా సలార్ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని కాస్త అసహనంతో ఉన్నారు అభిమానులు.
అలాంటి డార్లింగ్ అభిమానుల కోసమే అదిరిపోయే తీపికబురు సిద్ధం చేస్తున్నారు సలార్ సినిమా దర్శక నిర్మాతలు.
అందరికీ కామన్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ఓ ప్రత్యేకత ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా బుధవారం ఈ చిత్రం నుంచే సూరీడే అంటూ సాగె పాటను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఇది ట్రేండింగ్ లో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి