తన అందంతో ఆ చంద్రున్ని కూడా ప్రేమలో పడేస్తుందేమో ఈ భామ..

17 November 2023

5 నవంబర్ 1995న పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించింది వయ్యారి మెహ్రీన్ పిర్జాదా.

ఈమె తండ్రి గుర్లాల్ పిర్జాదా వ్యవసాయదారుడు స్థిరాస్తి వ్యాపారి. తల్లి పరమ్‌జిత్ కౌర్ పిర్జాదా గృహిణి.

ఈ ముద్దుగుమ్మకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. పేరు గుర్ఫతేహ్ పిర్జాదా. అతను మోడల్ గా, నటుడిగా పనిచేస్తున్నాడు.

తన పదేళ్ల వయసులోనే మొదటి ర్యాంప్ వాక్ చేసి అందాల పోటీలో కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ.

తర్వాత టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ వయ్యారి భామ.

జెమినీ ఫేస్ మోడలింగ్ కంపెనీలో ప్రముఖ డిజైనర్ల కోసం మోడల్ చేసింది. కెనడా, భారతదేశంలో అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది.

ఫేస్ ఆఫ్ డోవ్ ఇండియా, TVC, ప్రింట్ మీడియాలో నికాన్, పియర్స్, థమ్స్ అప్‌ యాడ్స్ లో కనిపించింది ఈ అమ్మడు.

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాలో నానికి జోడిగా కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ అందాల తార.