అందం ఈ వయ్యారి ఇంట దాస్యం చేస్తుందేమో..

21 November 2023

5 నవంబర్ 1995న పంజాబ్ రాష్ట్రంలోని భటిండా ఓ మధ్య తరగతి సిక్కు కుటుంబంలో జన్మించింది మెహ్రీన్ కౌర్ పిర్జాదా.

ఈ వయ్యారి తండ్రి గుర్లాల్ పిర్జాదా భటిండాలో వ్యవసాయదారుడు మరియు తల్లి పరమ్‌జిత్ కౌర్ పిర్జాదా గృహిణి.

ఈ ముద్దుగుమ్మ ఏకైక సోదరుడు గుర్ఫతేహ్ పిర్జాదా. అతను పంజాబ్ లో మోడల్ గా మరియు నటుడు గా పనిచేస్తున్నాడు.

పదేళ్ల వయసులో అందాల పోటీలో మొదటి ర్యాంప్ వాక్ చేసి కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ అందాల భామ.

తర్వాత టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కిరీటాన్ని కైవసం చేసుకోంది ఈ వయ్యారి భామ.

జెమినీ ఫేస్ మోడలింగ్ కంపెనీలో ప్రముఖ డిజైనర్ల కోసం మోడల్ గా చేసింది. కెనడా, భారతదేశంలో అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది.

ఫేస్ ఆఫ్ డోవ్ ఇండియా, TVC, ప్రింట్ మీడియాలో నికాన్, పియర్స్, థమ్స్ అప్‌ వంటి యాడ్స్ లో నటించింది ఈ బ్యూటీ.

నానికి జోడిగా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో చలచిత్ర తెరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.