ఈ వయ్యారిని చూసి చంద్రుడు నేలకు దిగిరాడా.. తన వెన్నల తిరిగి ఇవ్వమని..

TV9 Telugu

27 March 2024

5 జనవరి 1995న పంజాబ్ లోని బటిండాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ మెహ్రీన్ కౌర్ పిర్జాదా.

ఈ ముద్దుగుమ్మ తండ్రి గుర్లాల్ పిర్జాదా వ్యవసాయదారుడు, రియల్టర్ కూడా. తల్లి పరమ్‌జిత్ కౌర్ పిర్జాదా గృహిణి.

ఈ అందాల రాశికి ఉన్న ఏకైక సోదరుడు పేరు గుర్ఫతే పిర్జాదా. ఆయన మోడల్, సినిమాల్లో నటుడు కూడా పని చేస్తున్నాడు.

పంజాబ్‌లోని ఒక కాన్వెంట్ పాఠశాల, అజ్మీర్ లోని మేయో కాలేజ్ గర్ల్స్ స్కూల్,ఆరావళిలోని పాత్‌వేస్ వరల్డ్ స్కూల్ పాఠశాల విద్య అభ్యసించింది.

న్యూయార్క్‌లోని ఓ బిజినెస్ స్కూల్‌ నుంచి బిజినెస్ అడ్మిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.

తన పదేళ్ల వయసులో మొదటి ర్యాంప్ వాక్ చేసి అందాల పోటీలో కసౌలి ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ.

ఆ తర్వాత 2013లో కెనడాలోని టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా కిరీటాన్ని గెలుచుకుంది ఈ భామ.

2016లో తెలుగు చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాధతో నాని సరసన మహాలక్ష్మిగా సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.