26 February 2025

తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలతో చేసినా.. హిట్ మాత్రం దక్కలేదు

Rajeev 

Pic credit - Instagram

 మేఘా ఆకాష్. 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. అక్కడే  లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

చదువు తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 

ఆ తర్వాత తెలుగులో మరోసారి నితిన్ కు జోడీగా చల్ మోహన్ రంగ చేసింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. 

అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర, రవితేజ రావణాసుర చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది మేఘా.. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.