క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న మేఘా ఆకాష్

TV9 Telugu

18 JULY 2024

మేఘా ఆకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో ఈ ముద్దుగుమ్మ ఒకళ్ళు.

ఈ చిన్నది యంగ్ హీరో నితిన్ కు జోడీగా లై అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఆ సినిమా నిరాశపరిచినా.. మేఘా ఆకాష్ నటనకు అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత కూడా నితిన్ తోనే సినిమా చేసింది ఈ చిన్నది.

నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. 

డియర్ మేఘా, ప్రేమదేశం, రాజ రాజ చోర, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో మెరిసింది. ఇటీవలే రావణాసుర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరలవుతుంటాయి.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన క్యూట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. చుడిదార్ లో పద్దతిగా కనిపిస్తూ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది.