17 February 2024
బ్లాక్ కలర్ చీరలో మైండ్ బ్లాక్ చేస్తున్న మేఘా ఆకాష్
TV9 Telugu
మేఘా ఆకాష్.. నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ .
2017లో వచ్చిన లై సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ మేఘ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత కూడా నితిన్ తో మరో సినిమా చేసింది.
చల్ మోహన్ రంగ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది మేఘ ఆకాష్. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది.
బాలీవుడ్ లో శాటిలైట్ శంకర్ అనే సినిమా చేసింది ఈ చిన్నది. ఎన్ని సినిమాల్లో చేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది .
మేఘ ఆకాష్ పెద్దగా సినిమాలు చేయలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చివరిగా తెలుగులో డియర్ మేఘా (2021) లో కనిపించింది. 2021లో మేఘా ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి