ఒక్క ఫ్లాప్ చిరంజీవిలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేలా చేసింది. అందుకే స్క్రిప్ట్ సరిగ్గా లేదని కళ్యాణ్ కృష్ణ సినిమాను నిర్ధాక్షణ్యంగా పక్కనబెట్టారు మెగాస్టార్.
కథ బాగుందని వశిష్ట సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అంజి తరహాలో సోషియో ఫాంటసీ డ్రామా ఇది. ముల్లోకాల చుట్టూ కథ తిరుగుతుందని చెప్పారు దర్శకుడు వశిష్ట.
వశిష్ట తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని చూస్తున్నారు చిరంజీవి. నిజానికి నాలుగేళ్ళ కింద వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలోనే తమ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసారు మెగాస్టార్.
డివివి దానయ్య నిర్మాత కూడా అని చెప్పారు. కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. తర్వాత చిరు, త్రివిక్రమ్ ఇద్దరూ వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే ఈ కాంబోపై చర్చ నడుస్తూనే ఉంది.
త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నపుడు జై చిరంజీవకు చిరుతో పని చేసారు. ఆయన డైరెక్టర్‌గా బిజీ అయ్యాక.. రాజకీయాల్లోకి వెళ్లారు చిరు.
ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. నెక్ట్స్ అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే పుష్ప 2 తర్వాత అట్లీతో బన్నీ సినిమా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది.
వశిష్ట సినిమా ఎలాగూ ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్‌తోనే రన్ అవుతుంది. కాబట్టి రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయడం చిరుకు పెద్ద విషయం కాకపోవచ్చు.
ఈ లెక్కన ఒకవేళ అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే.. గుంటూరు కారం తర్వాత చిరు, గురూజీ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే జరగాలని మెగా ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.