20 February 2024

చిరు రేంజ్‌కు తగ్గట్లే రెమ్యునరేషన్.. ఎంతంటే ??

TV9 Telugu

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది.

అయితే చిరంజీవి మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

చిరంజీవికి మంచి కథ పడాలే కానీ.. పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం.

అయితే చిరు చరిష్మాను ద్రుష్టిలో పెట్టుకొని ఓ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తమ చిత్రానికి 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల ఫాలోయింగ్‌కు తగినట్లుగా చిరంజీవికి 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందన ఓ టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ.

అయితే సరైన స్క్రిప్ట్, దర్శకుడి కోసం సదరు ప్రొడక్షన్ కంపెనీ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.