18 November 2023

ఈ సారి అందుకే ఇంత గ్యాప్ అంటున్న చిరు.!

సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి  సడన్‌ గా ప్లాన్ మార్చేశారు.

వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టడంతో అప్‌ కమింగ్ సినిమాల విషయంలో కొత్త ట్రెండ్ సెట్‌ చేస్తున్నారు.

భోళా శంకర్ ఫెయిల్యూర్‌ తరువాత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ బిజీ అవుతున్నారు.

ఆల్రెడీ మెగా 156ను లాంచనంగా ప్రారంభించిన మెగాస్టార్‌ డిసెంబర్ నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతున్నారు.

అందుకే స్క్రిప్ట్ వర్క్‌ కే చాలా టైమ్ తీసుకున్నారు. భోళా శంకర్ సినిమా రిలీజ్ కన్నా ముందే వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ డ్రామాను ఒకే చేశారు మెగాస్టార్‌.

ఆ సినిమా స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేయటం మొదలు పెట్టారు భోళా శంకర్‌ కూడా నిరాశపరచటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మెగాస్టార్‌. 

బింబిసార సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వశిష్ట, రెండో సినిమాతోనే చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు.

ఎలాగూ కంటెంట్ విషయంలో చిరునే స్వయంగా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వటం పక్కా అన్న టాకే బలంగా వినిపిస్తోంది.