చిరంజీవి నెక్ట్స్ సినిమాపై సస్పెన్స్ వీడదా.! డైరెక్టర్ దొరకలేదా.?
Anil Kumar
10 August 2024
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తర్వాతి సినిమా ఏంటి..? ఇప్పటికే విశ్వంభర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.
అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి సర్చింగ్ మొదలైంది. ఫిబ్రవరిలో విశ్వంభర సెట్‌లో జాయిన్ అయ్యారు మెగాస్టార్.
ఆగస్ట్‌లోనే పూర్తి చేస్తున్నారు దర్శకుడు వశిష్ట. విజువల్ బేస్డ్ సినిమా కాబట్టి చిరంజీవి డేట్స్ తక్కువే అవసరం.
అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో పాటు మరికొందరు దర్శకులతో చర్చలు జరిగాయి.
మోహన్ రాజా ప్రస్తుతం తని ఒరువన్ 2తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి ముందున్న బెస్ట్ ఆప్షన్ హరీష్ శంకర్.
చాలా రోజులుగా చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వచ్చేలా కనిపిస్తుందిప్పుడు. మిస్టర్ బచ్చన్ హిట్టైతే..
కచ్చితంగా చిరు, హరీష్ సినిమా లాంఛనమే. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో ముందుకు కదిలడం కష్టమే.
మరోవైపు చిరంజీవి కూడా ఇతర సినిమాలు సైన్ చేయలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించబోతున్నారని తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి