సీనియర్ హీరోలపై చిరంజీవి సెటైర్లు.. 

14 October 2023

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఇలా డాన్సులతో నిండిపోయి ఉంటేనే ఆడియన్స్ చూస్తారు.. అభిమానులు కేకలేస్తారు..

అలా కాకుండా ఆయన అలా కామ్‌గా నడుచుకుంటూ వస్తే ఎవరు చూస్తారు చెప్పండి..? ఈ మాటలన్నది ఎవరో కాదు.. స్వయంగా చిరంజీవి.

తన నుంచి ఆడియన్స్ కోరుకున్నదే ఇస్తున్నానంటున్నారీయన. అంతేకానీ డాన్సుల్లేకుండా, ఫైట్స్ చేయకుండా ఉండలేనని తేల్చేసారు మెగాస్టార్.

అలాంటి మెగాస్టార్ ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. వయసైపోయింది.. నడుచుకుంటూ వెళ్లి ఆర్ఆర్, BGM వేసుకుని ఎలివేషన్స్‌తో నడిపిస్తే సరిపోతుందనే బ్యాచ్ తాను కాదన్నారు చిరు.

సాధారణంగా చిరంజీవి ఏం మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించి కానీ మాట్లాడరు. ఇక కాంట్రవర్సీలకు వీలైనంత దూరంగా ఉంటారాయన.

ఆగస్ట్‌లో రజినీకాంత్ జైలర్, చిరు భోళా శంకర్ ఒక్కరోజు గ్యాప్‌లో వచ్చాయి. అందులో భోళా డిజాస్టర్ అయితే.. జైలర్ బ్లాక్‌బస్టర్ అయింది.

భోళా శంకర్‌లో చిరు ఫైట్స్, డాన్సులతో ఒళ్లు హూనం చేసుకున్నా.. సింపుల్‌గా అలా ఎలివేషన్స్‌తో జైలర్ కుమ్మేసాడు. చిరు వ్యాఖ్యలు దీనికే సింక్ అవుతున్నాయి.

తానలా నడుస్తూ డబ్బులు తీసుకోలేనంటూ కామెంట్ చేసారు మెగాస్టార్ చిరంజీవి. మరి ఈ కామెంట్స్ వెనక అంతరార్థమేంటో..?