గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన 'ఇంద్ర'

TV9 Telugu

25 JULY 2024

‘ఇంద్ర’ చిత్రంలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా 24 జూలై 2002లో విడుదలైంది.

ఇంద్ర వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి.అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కింది.  బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.  

 పైగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో దూకుడు మీదున్న బి.గోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ‘ఇంద్ర’ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరు కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇంద్ర సినిమా 229 సెంటర్స్ లో 50 రోజులు నడిచింది. అంతేకాదు 126 కేంద్రాల్లో 100 రోజులు నడిస్తే.. 32 కేంద్రాల్లో 175 రోజుల పరుగును పూర్త చేసుకుంది.

విడుదలై 22 యేళ్లు గడుస్తున్న ఈ సినిమాను టీవీల్లో చూస్తే చూసే అభిమానులున్నారు. ఇంద్ర సినిమా అప్పట్లోనే రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

తెలుగులో తొలి రూ. 30 కోట్ల షేర్ మార్క్ అందుకున్న తొలి సినిమాగా ‘ఇంద్ర’ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు సినిమా బిజినెస్ పై 14 కోట్లకు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది.