ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్.. చిరు క్రేజీ అప్డేట్..

చిరు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భోళా శంకర్.

ఈ చిత్రంలో చిరుకి జోడిగా డేజ్లింగ్ బ్యూటీ తమన్నా నటిస్తుంది.

చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ ఈ చిత్రంలో కనిపించనుంది.

ఈ మూవీలో హీరో సుశాంత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజా ఈ చిత్రం డబ్బింగ్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు చిరు.

ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్.

ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది” అని ట్విట్టర్ ద్వారా తెలిపారు మెగాస్టార్.

ఈ మేరకు ఆయన డబ్బింగ్ చెప్పిన ఫోటోలను పంచుకున్నారు చిరు.