TV9 Telugu
6.4 అడుగులు హైట్ వల్ల హీరోయిన్స్ తో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్.
07 March 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముకుంద మూవీతోమొదలై ఆపరేషన్ వాలెంటైన్ వరకు వచ్చేసాడు.
ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వరుణ్ తేజ్ కు సినిమా కంటే ఎక్కువ పర్సనల్ ప్రశ్నలు ఎక్కువ ఎదురవుతున్నాయి.
ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు వరుణ్.. కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.
ముఖ్యంగా తన ఒరిజినల్ నేమ్ ఏంటో చెప్పేశాడు. అభిమానులు ఇంతకాలం అనుకున్నట్లు వరుణ్ తేజ్ అనేది అసలు పేరు కాదని..
తన పూర్తి పేరు ‘సాయి వరుణ్ తేజ్’ అని.. స్క్రీన్ మీద పెద్దదిగా ఉంటుందని సాయిని తీసేసారని చెప్పుకొచ్చాడు ఈ హీరో.
కానీ పాస్ పోర్టు, స్టడీ సర్టిఫికేట్స్ అన్నింటిలోనూ సాయి వరుణ్ తేజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్.
తన హైట్ 6 అడుగుల 4 అంగుళాలు ఉండటం వల్ల హీరోయిన్స్ తో నటించడంలో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి