25 February 2025
స్పెషల్ పాటలతోనే క్రేజ్.. 3 నిమిషాలకు 3 కోట్లు డిమాండ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం ఆమె స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటివరకు కెరీర్ మొత్తంలో ఒక్క హిట్ మూవీ కూడా లేదు. కానీ 3 నిమిషాలకు మూడు కోట్లు తీసుకుంటుంది.
అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ.
ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా. సినీరంగంలోకి రాకముందు అనేక అందాల పోటీలలో గెలిచింది ఈ వయ్యారి. కానీ ఇండస్ట్రీలో మాత్రం క్రేజ్ రాలేదు.
హిందీ, తెలుగు భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇటీవలే డాకు మహారాజ్ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో సందడి చేసింది.
ఇందులో మూడు నిమిషాల పాట కోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం తీసుకుందట ఈ వయ్యారి. ప్రస్తుత ఈ బ్యూటీ ఆస్తులు రూ.236 కోట్లు ఉన్నట్లు టాక్.
అలాగే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్ స్టాలో ఈ వయ్యారికి ఏకంగా 73 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.
2013లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ సరసన సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.
సింగ్ సాబ్ ది గ్రేట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ అంతగా ఆకట్టుకోలేదు. పదేళ్లల్లో ఒక్క హిట్ అందుకోలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్