26 February 2025
రవితేజకు లవర్‌గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
రవితేజకు లవర్‌గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అన్న సంగతి తెలుసా..
మాస్ మహారాజాతో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వీరిద్దరి జోడికి ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఉంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. శ్రుతి హాసన్. సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోలందరి సరసన నటించింది.
డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన బలుపు చిత్రంలో రవితేజ, శ్రుతిహాసన్ జంటగా నటించారు. ఇందులో రవితేజ లవర్‌గా కనిపించింది శ్రుతి.
ఆ తర్వాత వీరిద్దరు కలిసి క్రాక్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాలో రవితేజ భార్యగా కనిపించింది శ్రుతిహాసన్.
ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రుతి హాసన్ నటించింది. ఇందులో చిరు తమ్ముడిగా రవితేజ కనిపించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ మూవీలో రవితేజకు వదినగా కనిపించింది శ్రుతి. ఆ విధంగా రవితేజకు లవర్‌గా, భార్యగా, వదినగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆక్టటుకుంది ఈ బ్యూటీ.
చివరిసారిగా సలార్ చిత్రంలో నటించింది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు మరో ప్రాజెక్ట్ చేయడం లేదు. ఇటీవలే డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది శ్రుతి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్