స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న రాములమ్మ 

TV9 Telugu

12 March 2024

బాలయ్య.. ఆరు పదుల వయసులోనూ దుమ్ములేపుతున్నారు. ఓ వైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్‌గా అదరగొడుతూ అన్‌స్టాఫబుల్ అంటున్నారు.

అలాంటి బాలయ్య సినిమాలో బంపర్ ఛాన్స్‌ వస్తే ఎవరైనా నో అంటారా? ఈ బ్యూటీ అనింది! ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

ఒకప్పుడు టాలీవుడ్​లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్. అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది. సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇతర భాషల్లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం అందాలు ఆరబోస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తోంది.

అయితే ఎందుకో, ఏమో తెలీదు కానీ తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోలతో నటించేందకు ఆమె నో చెప్పిందనే టాక్ వచ్చింది.

వెంకీ నారప్ప సినిమాలో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందట మీరా జాస్మిన్. అలానే.. బాలయ్య వీర సింహా రెడ్డిలో చాన్స్ వచ్చినా నో చెప్పిందట. 

అయితే ఒకప్పుడు యాక్ట్ చేసిన బాలయ్యతో ఇప్పుడు ఎందుకు నో చెప్పిందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్.