మీరా జాస్మిన్ రీ ఎంట్రీ..  ముద్దుగుమ్మ లుక్స్ అదుర్స్

Phani.ch

04 June 2024

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరోయిన్ మీరా జాస్మి్న్. తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. 2014లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కానీ ఇప్పుడు భర్తతో విడిపోయింది.

ఇప్పుడిప్పుడు మలయాళం సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల మమ్ముట్టి సరసన ఓ ప్రాజెక్ట చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తిరిగి వస్తుంది.

హీరో శ్రీవిష్ణు కొత్త ప్రాజెక్టుతో తెలుగు తెరపై మరోసారి సందడి చేయనుంది. ఇటీవల సామజవరగమన, ఏం భీమ్ బుష్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీవిష్ణు త్వరలోనే స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇందులో మీరా జాస్మిన్ కీలకపాత్ర పోషిస్తుంది. 

తాజాగా ఈరోజు మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో మహారాణిలా తయారై కనిపిస్తుంది మీరా జాస్మిన్.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరలవుతుండగా.. చాలా కాలం తర్వాత మరోసారి మీరాను తెలుగు సినిమాల్లో చూసి సంతోషిస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.