అందామనే అమృతాన్ని తాగి పెరిగిందేమో ఈ భామ..

19 December 2023

TV9 Telugu

15 ఫిబ్రవరి 1982న కేరళలోని తిరువల్లలో ఓ క్రైస్తవ కుటుంబంలో జోసెఫ్, ఏలియమ్మ అనే దంపతులకు జన్మించింది మీరా జాస్మిన్.

ఈ ముద్దుగుమ్మ తల్లిదండ్రులకి ఐదుగురు సంతానం. వారిలో ఈమె నాల్గవది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్.

ఆమెకు జిబి సారా జోసెఫ్, జెనీ సుసాన్ జోసెఫ్ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

ఈ వయ్యారికి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన జార్జ్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

తిరువల్లలోని బాల విహార్ మరియు మార్తోమా రెసిడెన్షియల్ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ బ్యూటీ.

కేరళ రాష్ట్రంలోని చంగనస్సేరిలో అసంప్షన్ కాలేజీ నుంచి జువాలజీలో BSc డిగ్రీ పట్టా అందుకుంది ఈ వయ్యారి భామ.

మొదట్లో చదువుకుని డాక్టర్ కావాలనుకున్నానని సినీ నటి కావాలని కలలు కనలేదని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది.

2004లో అమ్మాయి బాగుంది అనే చిత్రంతో టాలీవుడ్ కి కథానాయకిగా పరిచయమై ఎన్నో తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది.