ఆ స్టార్ హీరో అంటే క్రష్.. ఆయన లాంటి భర్త రావాలి: మనసులో మాట బయట పెట్టిన మీనాక్షి

24 January 2025

Basha Shek

 ప్రస్తుతం టాలీవుడ్ లో మీనాక్షి చౌదరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

గత ఏడాది అరడజను  చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ  లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది

ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మీనాక్షి చౌదరి.  ఇది కూడా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పి సర్ ప్రైజ్ చేసింది.

' నాకు ప్రభాస్ గారు చాలా ఇష్టం.. ప్రస్తుతం ఆయనే నా క్రష్.. చాలా అందంగా పొడుగ్గా ఉంటారు." అంటూ మీనాక్షి చెప్పుకొచ్చింది.

ఇక తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. ' ఈ విషయానికి సంబంధించి  వంద విషయాలు నా మనసులో ఉన్నాయి'

 'ముఖ్యంగా హైట్ ఉండాలి.   మంచి మనసు ఉన్న వ్యక్తి కావాలి. అంతేకాకుండా మంచి ఇంటెలిజెంట్ అయి ఉండాలి

'సింపుల్‌గా చెప్పాలంటే నాకు నా లాంటి మేల్ వెర్షన్ కావాలి.. అలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని చెప్పుకొచ్చింది మీనాక్షి.