ఇంత రిస్క్ ఏంటీ అమ్మడు.. విలన్గా స్టార్ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇటీవలే ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయింది.
ఇక ఇప్పుడు కెరీర్ మంచి ఫాంలో ఉండగానే రిస్క్ చేస్తుందట ఈ వయ్యారి. ఈ బ్యూటీ ఓ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర చేయడానికి రెడీ అయ్యిందట.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. పొడుకు కాళ్ల సుందరి మీనాక్షి చౌదరి. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్.
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిట్ 2తో సూపర్ హిట్ అందుకుని వరుస ఆఫర్స్ దక్కించుకుంది.
ఇటీవల గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యిందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు భారీ ప్రాజెక్టులో ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్.
అందులో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.