08 September 2023
'నా జీవితం పూలపాన్పేమీ కాదు'.. మీనాక్షి ఇన్ని కష్టాలు పడిందా?
సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది హీరోయిన్ మీనాక్షి చౌదరి
ఆ తర్వాత మాస్ మహరాజా రవితేజతో కలిసి ఖిలాడీ సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకుడు
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో లేటెస్ట్ సెన్సేషనల్ శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ మూవీ అప్డేట్స్ రానున్నాయి.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది మీనాక్షి చౌదరి. తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది
తన జీవితం పూలపాన్పేమీ కాదంటూ ఈ స్థాయికి చేరకోవడానికి చాలామందిలా చాలా కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది
'చాలాసార్లు నేను పడిపోయాను, ప్రయత్నించాను, మళ్లీ లేచాను ఇదే నా జీవితం ' అని ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది మీనాక్షి చౌదరి
ప్రస్తుతం పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఈ అందాల తారకు ఇన్ని కష్టాలున్నాయా? అంటున్నారు నెటిజన్స్
ఇక్కడ క్లిక్ చేయండి..