ఆ
స్టార్
క్రికెటర్ అంటే పిచ్చి.. మనసులో మాట బయట పెట్టిన మీనాక్షి
13 May 2025
Basha Shek
ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి అందరికన్నా ముందుంటుంది.
గతేడాది లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో మరో హిట్ అందుకుంది.
ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ఓ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మీనాక్షి ఇటీవల తన ఫాలోవర్లతో సరదాగా ముచ్చటించింది.
ఇందులో భాగంగా 'ఐపీఎల్ జట్లలో మీకు నచ్చిన టీమ్ ఏది?' అన్న ప్రశ్నకు మీనాక్షి సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
తాను ప్రత్యేకంగా ఏ జట్టును ఫేవరెట్‌గా భావించనప్పటికీ, ఎంఎస్.ధోనిపై తనకు ప్రత్యేక అభిమానం ఉన్నదని చెప్పింది మీనాక్షి.
ధోనీ ఎక్కడ ఆడితే ఆ జట్టే తనకు ఫేవరెట్ అని చెప్పిన మీనాక్షి, అతని కోసమే తాను క్రికెట్‌ను చూస్తానని చెప్పుకొచ్చింది.
మొత్తానికి తన ఆసక్తికర సమాధానాలు, మాటలతో ధోని అభిమానుల మనసులు కూడా గెల్చుకుంది మీనాక్షి చౌదరి.
ఇక్కడ క్లిక్ చేయండి..