మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కిల్లింగ్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది ముద్దుగుమ్మ.
2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.
గుంటూరుకారంలో మహేష్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వెంకటేష్, చిరంజీవి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. వరుణ్‌తేజ్, దుల్కర్ సల్మాన్ లకు జోడీగా కనిపించబోతున్నది.
చిరంజీవి విశ్వంభరలో మీనాక్షి చౌదరి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. త్రిష మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
సీతారామం బ్లాక్‌బస్టర్ తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్ చేస్తోన్న లక్కీ భాస్కర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో ఆల్ టైం రికార్డు హిట్ ఆమె కొట్టింది.
తెలుగులో సహా తమిళ భాషల్లో మరిన్ని వరుస సినిమాలతో మీనాక్షి ఫుల్ బిజీగా మారి మంచి డిమాండ్ ని ఏర్పర్చుకుంది.