అబ్బా ఎంత అదృష్టం అని నేల పులకించగదా ఈ మగువ పాదం తాకి..

TV9 Telugu

22 January 2024

1 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో పంచకుల అనే ఓ ఊరిలో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి.

చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ బ్యూటీ.

పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ భామ.

చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 1వ రన్నరప్‌గా కిరీటాన్ని పొందింది.

ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియం వేదికగా గ్రాండ్ ఫినాలే పోటీలో 'మిస్ ఫోటోజెనిక్' అనే ఉప శీర్షికను కూడా గెలుచుకుంది.

2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. తర్వాత ఖిలాడీ, హిట్: ది సెకండ్ కేస్ చిత్రాల్లో నటించింది.

తాజాగా గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు మరదలిగా కనిపించింది. ప్రస్తుతం #VS10, మట్కా, లక్కీ భాస్కర్ చిత్రాల్లో నటిస్తుంది.