బ్రహ్మ ఈమెను చూసి అనుకుంటాడేమో.. పొరపాటున దేవతను భూవిపైకి పంపానేమోనని..!

24 November 2023

1 ఫిబ్రవరి 1997న హర్యానాలోని పంచకులలో జన్మించింది మీనాక్షి చౌదరి. ఈమె భారత సైన్యం కల్నల్ కి. శే B.R చౌదరి కూతురు.

చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి.

పంజాబ్‌లోని డేరా బస్సీలో నేషనల్ డెంటల్ కాలేజ్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.

ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది.

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 1వ రన్నరప్‌గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

2021లో సుశాంత్ సరసన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంలో కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది ఈ భామ.

2022లో రవితేజతో జంటగా ఖిలాడీ, అడవి శేష్ కి జోడిగా హిట్ ది కేస్ 2 అనే తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం గుంటూరు కారం, VS10, మట్కా, లక్కీ భాస్కర్ వంటి నాలుగు తెలుగు చిత్రాల్లో నటిస్తుంది ఈ వయ్యారి భామ.