14 September 2025
ఇండస్ట్రీలో సైలెంట్ అయిన మీనాక్షి.. నెట్టింట ఫాలోయింగ్ చూస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు మీనాక్షి చౌదరి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి.
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు..హిట్ 2, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో నటించింది.
చివరగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సుందరి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈముద్దుగుమ్మ అటు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి వరుస ఫోటోస్ షేర్ చేస్తుంది మీనాక్షి.
హార్యానాకు చెందిన ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మోడల్ గా పేరు దక్కించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసిన ఆమె మయన్మార్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018
అందాల పోటీలలో పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 2018 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని అందుకుంది .
2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళంలో వరుస హిట్స్ అందుకుంటూ స్పెషల్ ఇమేజ్ దక్కించుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్