25 January 2025
ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమంటోన్న మీనాక్షి.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మీనాక్షి చౌదరి. ఇందులో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి ప్రధాన పాత్రలు పోషించారు.
దీంతో ఇప్పుడు తెలుగులో మీనాక్షికి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది మీనాక్షి.
అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి మోస్ట్ బిజీ హీరోయిన్ కానుందని.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి.. టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మధ్య కాలంలో మీు బాగా నచ్చిన వ్యక్తి, మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించగా.. వెంటనే అనుష్క పేరు చెప్పేసింది మీనాక్షి.
అనుష్క అంటే చాలా ఇష్టమని.. ఆమె ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారని.. తాను ఎప్పుడు ఆమెను ఆదర్శంగా తీసుకుంటుందట.
ఒక వ్యక్తిగా ఆమెను ఎంతగానో ఇష్టపడుతానని.. అనుష్క ఒక అద్భుతమైన వ్యక్తి అని.. ఆమె ప్రతి ఒక్కరిని గౌరవిస్తారని చెప్పుకొచ్చింది మీనాక్షి.
ప్రతి ఒక్కరితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారని.. అందుకే ఆమె అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది మీనాక్షి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్