03 January 2025

గ్లామర్‏తో విధ్వంసం.. యాక్షన్ సీక్వెన్స్‏తో అరాచకం ఈ హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. 

ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అలరించనుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి హీరోయిన్లు. 

ఈ సినిమా జర్నీ తనకు ఒక డ్రీమ్ లా ఉందని.. తనను తాను నిరూపించుకునే మంచి కథలు , పాత్రలు రావడం సంతోషంగా ఉందని తెలిపింది. 

కాప్ రోల్ చేయాలనే తన డ్రీమ్ ఈ సినిమాతో తీరిందని తెలిపింది. తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అని.. అందుకే ఆఫీసర్ బాడీ లాంజ్వేజ్ ఐడియా ఉందట. 

సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అని.. మేజర్ పోర్షన్ కామెడీ ఉంటుందని తెలిపింది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 

ప్రస్తుతం తాను నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నానని.. అలాగే తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది మీనాక్షి. 

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. అటు సోషల్ మీడియాలోనూ అటు ట్రెడిషన్, ఇటు గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.