స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే కిస్ సీన్స్ చేసేందుకు రెడీ.. మీనాక్షి..
TV9 Telugu
Pic credit - Instagram
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో కేవలం తక్కువ సమయమే కనిపిస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న మీనాక్షి.. సినిమాల్లో కొన్ని సీన్లలో నటించేందుకు తనకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
సినిమాల్లో తన కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నానని.. తెరపై ముద్దు సీన్లకు సంబంధించిన కొన్ని రూల్స్ కచ్చితంగా పాటిస్తానని చెప్పుకొచ్చింది.
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్ప అలాంటి వాటికి ఒప్పుకోనని.. అది కూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే చేస్తానని.. కేవలం కిస్ సీన్స్ అంటే అస్సలు చేయనని తెలిపింది.
భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయాలనేదే తన కోరికని వెల్లడించింది. అందుకే కథల విషయంలో ఆలోచింతి నిర్ణయం తీసుకుంటుందట.
రెమ్యునరేషన్ కంటే నటనకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానంటుంది మీనాక్షి. అలాగే తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని తెలిపింది.
ఇదిలా ఉంటే.. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో అరంగేట్రం చేసింది మీనాక్షి. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీ లో కనిపించింది.
ఇదిలా ఉంటే.. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో అరంగేట్రం చేసింది మీనాక్షి. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీ లో కనిపించింది.