అందం, సొగసు ఈమెకు అప్పు ఉన్నాయేమో.. వడ్డీ కడుతూనే ఉన్నాయి..

10 October 2023

1 ఫిబ్రవరి 1997న హర్యానాలోని పంచకులలో జన్మించింది స్టన్నింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఇండియన్ ఆర్మీ మాజీ సైనికాధికారి B.R చౌదరి ఈమె తండ్రి.

చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.

డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

చదువుకుంటున్న రోజుల్లో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ లో విన్నర్ గా నిలిచింది ఈ వయ్యారి భామ.

ఫ్యాషన్ బిగ్ బజార్ ప్రాయోజిత క్యాంపస్ ప్రిన్సెస్ 2018లో పాటియాలా ఆడిషన్స్ నుంచి విజేతలలో ఒకరిగా కిరీటం పొందింది ఈ బ్యూటీ.

2018లో ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2018 గ్రాండ్ ఫినాలేలో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది.

2021లో సుశాంత్ కి జోడిగా తెలుగు చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదుతో చిత్ర రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి.

దీని తర్వాత ఖిలాడీ, హిట్ 2 చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం గుంటూరు కారం, VS10, మట్కా, లక్కీ భాస్కర్ చిత్రాల్లో నటిస్తుంది.