సలార్ నుంచి మాస్ ప్రోమో..

29 December 2023

TV9 Telugu

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సినిమా సలార్‌. డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది.

తాజాగా గురువారం ఈ బ్లక్ బస్టర్ సినిమా నుంచి యాక్షన్‌ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ కీ రోల్‌ చేశారు. శ్రుతిహాసన్‌ నాయిక. జగపతిబాబు ముఖ్యభూమిక పోషించారు.

వీరితో పాటు ఇందులో ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి, గరుడ రామ్, టిను ఆనంద్ వంటి స్టార్ నటులు వారి నటనతో ఆకట్టుకున్నారు.

మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన సలార్ తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. మొదటి 178.7 కోట్లు వచ్చాయి.

సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రం 500 కోట్ల మార్క్‌ను రీచ్ అయ్యింది తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు మేకర్స్.

ప్రభాస్ ఎలివేషన్స్ మాస్ యాక్షన్ తో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాశారు ప్రశాంత్. ఇది కచ్చితంగా 1000 కోట్లు వసూళ్లు చేస్తుంది అంటున్నారు.

దీని క్లైమాక్స్ వీక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అని ఎండ్ క్రెడిట్స్ లో రివీల్ చేసారు.