శ్రీవిష్ణు సినిమాపై మాస్ మహారాజ ప్రశంసలు..

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సామజవరాగమన.

రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంతో రెబ మోనికా జాన్ కథానాయకిగా తెలుగులో పరిచయం అయింది.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితరాలు కీలక పాత్రల్లో కనిపించరు.

జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటె ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు మాస్ మహారాజ రవితేజ.

ఈ మూవీ చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకున్నా సినిమా చాలా బాగుంది అని తెలిపారు అయన.

ఈ చిత్రం దర్శకుడు రామ్ అబ్బరాజుకి, రైటింగ్ టీంకి నా శుభాకాంక్షలు రవితేజ అని తెలిపారు.

దీనిపై శ్రీ విష్ణు స్పందిస్తూ రవితేజ మెచ్చుకోవడం ఆనందంగా ఉందని.. ఆయన ప్రశంస చాలా గొప్పదని  తెలిపారు.