విక్రమార్కుడు2 - మాస్‌ మహరాజ్‌ ఇంట్రస్ట్ గా లేరా?

TV9 Telugu

10 March 2024

విక్రమార్కుడు సినిమా మాస్‌ మహరాజ్‌ రవితేజ కెరీర్‌లో ఎలాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్టో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ మీద మాస్‌ మహరాజ్‌తో కలిసి ఓ మేజిక్‌ క్రియేట్ చేశారు జక్కన్న.

అలాంటి సినిమాకు సీక్వెల్‌ చేయడానికి హీరో రవితేజ ఇంట్రస్ట్ గా లేరన్నది లేటెస్ట్ గా వైరల్‌ అవుతున్న వార్త.

విక్రమార్కుడు2 సినిమాకు కథ సిద్ధంగా ఉందని రీసెంట్‌గా ఓపెన్‌ అయ్యారు ఈ సినిమా ప్రొడ్యూసర్‌ కేకే రాధామోహన్‌.

దర్శకుడు సంపత్‌ నంది విక్రమార్కుడికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను డైరక్ట్ చేస్తారని కూడా అన్నారు ఆయన.

అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మాస్ మహారాజా రవితేజ రెడీగా లేరన్నది ప్రొడ్యూసర్‌ తరఫున వినిపిస్తున్న మాట.

రవితేజను ఎలాగైనా ఒప్పిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు రాధామోహన్‌. మరి జక్కన్నతో చేసిన సినిమాను, సంపత్‌నందితో చేయడానికి వెనకడుగేస్తున్నారా?

లేకుంటే, ఐకానిక్‌ మూవీకి సీక్వెల్‌ చేసి రిజల్ట్ తేడాగా వస్తే బాధపడటం ఎందుకని వద్దనుకుంటున్నారా? రవితేజ మనసులో ఏముందో మరి?