మనోజ్ బాజ్‌పాయ్ సినిమా టైటిల్ ఖరారు.. ఇళయరాజా బయోపిక్ కి అంతా సిద్ధం..

TV9 Telugu

23 March 2024

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన వందో చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన అపూర్వ సింగ్ కర్కీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

భయ్యాజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ అయ్యింది. మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జేమ్స్ బాండ్ సిరీస్‌లో కొత్త బాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో బాండ్ పాత్రలో నటించిన డానియల్‌ క్రెగ్‌ ఇటీవల ఆ క్యారెక్టర్‌కు గుడ్‌బై చెప్పేశారు.

దీంతో కొత్త బాండ్‌ను రంగంలోకి దించే పనిలో ఉంది చిత్రయూనిట్‌. దీని గురించి త్వరగానే అప్డేట్ ఇవ్వనున్నారు.

గాడ్జిల్లా, అవెంజర్స్ లాంటి సినిమాల్లో నటించిన ఆరోన్‌ టేలర్‌ను కొత్త బాండ్‌గా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉంది మూవీ టీమ్‌.

లెజెండరీ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా జీవిత చరిత్రపై తమిళంలో ధనుష్ హీరోగా ఓ బయోపిక్ సినిమా వస్తుంది.

దీనికి ఇళయరాజా అనే టైటిల్ ఖరారు చేసారు. అరుణ్ మత్తేశ్వరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు ఇళయరాజానే సంగీతం అందిస్తుండటం విశేషం.