ఓం భీమ్ బుష్ ముచ్చట.. మంజుమ్మల్ బాయ్స్ జోరు.. 

TV9 Telugu

07 April 2024

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో శ్రీ హర్ష తెరకెక్కించిన సినిమా ఓం భీమ్ బుష్.

ఈ తెలుగు బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని తెలిపారు దర్శక నిర్మాతలు.

సామజవరగమనా తర్వాత మరో క్లీన్ హిట్ అందుకున్నారు శ్రీ విష్ణు. ప్రీతి ముఖుందన్ ఓం భీమ్ బుష్ మూవీలో హీరోయిన్.

యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీనికి సన్నీ MR సంగత దర్శకుడు. త్వరలో ఓటీటీలో రానుంది.

ఇన్నేళ్ల మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలో 200 కోట్లకు పైగా భారీ వసూలు చేసిన మొదటి చిత్రం మంజుమ్మల్ బాయ్స్.

ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేసారు ప్రముఖ టాలీవుడ్ పరిశ్రమ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.

ఈ సర్వైవల్ థ్రిల్లర్‌‌కు తెలుగులో కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. చాలాచోట్ల స్క్రీన్స్ కూడా పెంచారు.

లాంగ్ వీకెండ్ ఉండటంతో మంజుమ్మల్ బాయ్స్ సినిమా జోరు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇది తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.