OTTలోకి వచ్చేస్తోన్న 200 కోట్ల మూవీ...
TV9 Telugu
12 April 2024
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన సినిమా మంజుమెల్ బాయ్స్. ఈ సినిమా ఏకంగా 200 కోట్లుకు పైగా వసూళ్లను రాబట్టిందీ.
మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మంజుమెల్ బాయ్స్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది.
ఏప్రిల్ 6న విడుదలైన సినిమా ఇక్కడ కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. అయితే ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై క్యూరియాసిటీ పెరిగింది.
గత కొన్ని రోజులుగా మంజుమెల్ బాయ్స్ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు.
అయితే ఇప్పుడు ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై మళ్లీ బజ్ వచ్చింది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.
మంజుమెల్ బాయ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మే 3వ తేదీ నుంచి ఈ సర్వైవర్ థ్రిల్లర్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
ఆ రోజున మలయాళం, తెలుగుతో పాటు మరిన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నారని టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి