22 May 2025

మంజు వారియర్ ఆస్తులు తెలిస్తే షాకే.. ఒక్క సినిమాకు పారితోషికం ఎంతంటే

Rajitha Chanti

Pic credit - Instagram

మలయాళంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో మంజు వారియర్ ఒకరు. ఇప్పుడు తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది.

దాదాపు 14 సంవత్సరాల తర్వాత తిరిగి నటనలోకి వచ్చిన మంజు వారియర్ ఇప్పుడు మలయాళంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు.

ఆమె తన ఒక్క సినిమాకు రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు వసూలు చేస్తుందని సమాచారం. అజిత్ తునీవు సినిమాకు కోటి వసూలు చేసిందని టాక్.

సినిమాలతోపాటు అటు ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా అధికంగా సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం మంజు వారియర్ ఆస్తులు రూ.150 కోట్లు. 

మంజు ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో వసూలు చేస్తుందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

1995లో సాక్ష్యం సినిమా ద్వారా మలయాళీ చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. 

ఆ తర్వాత మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన నటనతో ఎన్నో పురస్కారాలు అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

పెళ్లి, విడాకులతో నిజ జీవితంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురైన మంజు వారియర్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకే పోటి ఇస్తుంది.